అభిమానుల‌కు నో ఎంట్రీ -ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌

ముంబై: ప‌్రేక్ష‌కులు లేకుండానే భార‌త్, ఇంగ్లండ్ వ‌న్డే సిరీస్ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. అయితే అన్ని మ్యాచ్‌లు అక్క‌డే జ‌రుగుతాయా లేక మూడో వ‌న్డేను ముంబైకి త‌ర‌లిస్తారా అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్ట్ నుంచే స్టేడియాల‌కు అభిమానుల‌ను అనుమ‌తిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాలుగో టెస్ట్ త‌రువాత ఐదు టీ20 లు కూడా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలోనే జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌రువాత మార్చి 23,26,28 తేదీల్లో పుణెలో మూడు వ‌న్డేలు జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఒక‌వేళ కేసులు ఇలాగే పెరిగితే.. వ‌న్డే సిరీస్‌ను కూడా అహ్మ‌దాబాద్‌లోనే కొనసాగించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *