క‌రోనా సంబంధిత సేవ‌ల కోసం రూ1.17కోట్లు- సోనియాగాంధీ

న్యూఢిల్లీ:క‌రోనా సంబంధిత సేవ‌ల కోసం కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని రాయ్ బ‌రేలీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో నిధులు మంజూరు చేశారు. ఆమె శుక్ర‌వారం రాయ్ బ‌రేలీ జిల్లా మేజిస్ట్రేట్ కు రాసిన లేఖ‌లో త‌న ఎంపీ నిధుల నుండి ఈ సొమ్మును తీసుకుని, కొవిడ్-19 మ‌హ‌మ్మారి బాధితుల‌ను కాపాడ‌టం కోసం ఖ‌ర్చు చేయాల‌ని కోరారు. ప్ర‌జ‌లంతా ఇళ్ళ‌లోనే ఉండాల‌ని, అవ‌స‌రం లేకుండా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆమె కోరారు. అంద‌రూ కొవిడ్ సంబంధిత మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని కోరారు. ఆక్సిజ‌న్ స‌కాలంలో అంద‌క‌పోవ‌డంతో ఐదుగురు క‌రోనా పాజిటివ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన సంద‌ర్భంలో ఆమె ఈ లేఖ రాశారు. రాయ్ బ‌రేలీలోని కొవిడ్‌-19 పాజిటివ్ రోగుల‌కు అవ‌స‌ర‌మైన సేవ‌ల‌ను అందించ‌డం కోసం త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల నుండి రూ.1.17 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ఈ లేఖ‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *