భార‌త‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: ఇండియాలోని రోజురోజు క‌రోనా మ‌హ‌మ్మారి పెట్రేగిపోతుంది తెలిసిన విష‌య‌మే. క‌రోనా పాజిటివ్ కేసులు గ‌త 24 గంట‌ల్లో తాజాగా 68,020 మంది కొవిడ్ బారిన‌ప‌డ్డారు. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ త‌రువాత ఒకే రోజు ఇంత భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది. ఇందులో 1,13,55.993 మంది బాధితులు వైర‌స్ నుంచి కోలుకున్నారు. మ‌రో 1,61,843మంది మ‌ర‌ణించారు. కాగా, క‌రోనా బాధితుల సంఖ్య అధిక‌మ‌వుతుండంతో ఇండియాలో యాక్టివ్ కేసులు ఐదు ల‌క్ష‌లు దాటాయి. మొత్తం కేసుల్లో 5,21,808 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే నిన్న మ‌హ‌మ్మారి వ‌ల్ల 291 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 32,231 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు 6,05,30,435 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామ‌ని వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా 24,18,64,161 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో మార్చి28న 9,13,319 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *