వ‌ల‌స కార్మికులు పొందుతున్నారో లేదో-ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప‌థ‌కాలు

హైదరాబాద్‌: ఇప్పుడు ఎక్క‌డి చూసిన క‌రోనా మ‌హ‌మ్మారి విలాయ‌తాడ‌వం చేస్తున్న సంగ‌తితెలిసిందే. క‌రోనా ఎక్కువ కావ‌డంతో అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అమ‌లు చేస్తారు. ఇలాంటి త‌రుణంలో వ‌లస కూలీలు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వ‌ల‌స కూలీల స‌మ‌స్య‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం .ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌యోజ‌నాలు వ‌ల‌స కూలీల‌కు అందుతున్నాయా? అని ప్ర‌శ్నించింది. ప‌థ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ, స‌రైన గుర్తింపు లేక ఎంతో మంది వాటిని పొంద‌లేక‌పోతున్నార‌ని జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ , జ‌స్టిస్ ఎంఆర్‌షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. గుర్తింపు న‌మోదు ఉంటేనే వ‌స‌ల కార్మికుల‌కు ప‌లు ప‌థ‌కాలు ల‌బ్ది చేకూరుతుంది. గ‌త సంవ‌త్స‌రం వ‌ల‌స కార్మికుల రిజిస్ట్రేష‌న్ చేప‌ట్టాల‌ని ఆదేశించిన‌ప్ప‌టికి అది న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. దీంతో ప‌థ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ ల‌బ్ధిదారుల‌కు చేర‌ట్లేదు. మ‌హ‌మ్మారి సంక్షోభ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికులంద‌రినీ న‌మోదు చేయాలి. అని ధ‌ర్మాస‌నం సూచించింది. ఈనేప‌థ్యంగా ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్, జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం వంటి వ‌ల‌స కూలీల‌కు వ‌ర్తిస్తాయా అన్న‌దానిపై న్యాయ‌స్థానం ఆరా తీసింది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌యోజ‌నాలు వ‌ల‌స కార్మికులు పొందుతున్నారో లేదో తెల‌పాల‌ని అన్ని రాష్ట్రాలు, కేంద్రం తెలపాల‌ని ఆదేశించింది. స‌మ‌గ్ర వివ‌రాల‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *