క‌రోనాతో మృతి చెందిన‌వారికి ఉచిత అంతిమ‌యాత్ర -జీహెచ్ఎంసీ

హైద‌రాబాద్‌: బ‌ల్దియా ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో శ్మ‌శాన‌వాటిక‌లు,అంబులెన్స్‌ల అధిక చార్జీల‌కు చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.క‌రోనా తో మృతి చెందిన‌వారికి ఉచిత అంతిమ‌యాత్ర వాహ‌నాల‌ను ఏర్పాటు చేశారు.ఆరు జోన్ల‌లో 14వాహ‌నాల‌ను అందుబాటులో ఉంచారు.డీసీఎం వ్యాన్‌ల‌ను అంతిమ‌యాత్ర వాహ‌నాలుగా మార్చారు. ఈ నేప‌థ్యంగా జాయింట్ క‌మిష‌న‌ర్ ముచ్చ‌టిస్తూ మంత్రికేటీఆర్ ఆదేశాల‌మేర‌కు ఈ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించ‌మ‌న్నారు. వాహ‌నం కావాల్సిన‌వారు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే 15 నిముషాల్లో వాహ‌నం వ‌స్తుంద‌ని చెప్పారు.అలాగే శ్మ‌శానాల్లో కూడా రేటు ఫిక్స్ చేసిఫ్ల‌క్సీలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఒక‌వేళ అధిక చార్జీలు వ‌సూలు చేసిన‌ట్లు ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *