తెలంగాణ రాష్ట్రం ఏం బాగుందో ఆయ‌న చెబితే బాగుంటుంద‌న్నారు…

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నా, సీఎస్ సోమేశ్ కుమార్ మాత్రం లాక్‌డౌన్ అవ‌స‌రం లేదంటున్నార‌ని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం బాగుందో ఆయ‌న చెబితే బాగుంటుంద‌ని చుర‌క‌లంటించారు. ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ లేద‌ని, ప‌డ‌క‌లు కూడా దొర‌క‌డం లేద‌ని పేర్కొన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని, ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ని, ఈ విష‌యం సోమేష్ కుమార్ గ్ర‌హించాల‌ని వీహెచ్ తెలిపారు. సీఎస్ వాస్త‌వాల‌ను చెప్పాల‌ని,ప్ర‌జ‌ల ప్రాణాలు స‌ర్కారు కు ముఖ్యం కాదా? అని ప్ర‌శ్నించారు. కోవిడ్‌పై ఓ నిర్ణ‌యం తీసుకొని, ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాల‌ని వీహెచ్ ప్ర‌భుత్వానికి సూచించారు. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై వీహెచ్ ఫైర్ అయ్యారు.బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని బండి సంజ‌య్ మ‌మ‌తాఖాన్ అని కించ‌ప‌ర‌చ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కోన్నారు. ఈ వాఖ్యాల‌కు బండి సంజ‌య్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వీహెచ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *