లాక్‌డౌన్ అతిక్ర‌మించిన ప్ర‌జ‌లు..

హైద‌రాబాద్‌: ప‌్ర‌స్తుతం రాష్ట్రం లో క‌రోనాఉదృతంగా ఉండ‌టంతోమ లాక్ డౌన్ విధించిన ప్ర‌భుత్వం.క‌రోనా క‌ట్ట‌డికి అనేక మార్గాలను ద్వారా క‌రోనా అరిక‌ట్టాడానికి ప్ర‌య‌త్నిస్తే ప్ర‌జలు మాత్రం ఏమీప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హారిస్తున్నారు. మే 12నుండి 30వ‌ర‌కు తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించిన విష‌యం తెలిసిందే ఎన్ని నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన అదేశాలు జారీ చేసింది. ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగ‌నుంది. అయితే… నాలుగు గంట‌ల స‌మ‌యంలో రోడ్ల‌పైకి భారీగా ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. ఉద‌యం 10గంట‌లు దాటినా… న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాల ర‌ద్దీ నెల‌కొంటోంది. అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు వ‌చ్చే వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశాలు రావ‌డంతో 2021 మే 22 తేదీ శ‌నివారం కీల‌క ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి కార‌ణం లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్పాట్ వ‌హ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. ఇక‌పై అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌స్తే తాట తీస్తామంటున్నారు. తెలంగాణ పోలీసులు .లాక్‌డౌన్ ఆంక్ష‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం చేయాల‌ని ఆదేశాలు రావ‌డంతో .రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారు. పోలీసులు ఉద‌యం10గంట‌ల త‌రువాత
అకార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేయాల‌ని డీజీపీ ఆదేశించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ‌లు తీరును ప్ర‌తిరోజూ జిల్లాల వారీగా కేసీఆర్ స‌మీక్షిస్తున్నార‌ని, పోలీస్ క‌మిష‌న‌ర్‌, ఎస్పీ,డీఎస్పీ, డీసీపీ, ఏసీపీ స్థాయి ఉన్న‌తాధికారులంతా క‌చ్చితంగా క్షేత్ర‌స్థాయిలో ఉండి ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్పారాయ‌న మార్కెట్లు, దుకాణాలు ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమికూడ‌టం క‌నిపిస్తోంద‌ని దీనిని నివారించేందుకు ఉద‌యం 6గంట‌ల నుంచే త‌మ అవ‌స‌రాల కోసం వెళ్లేలా ప్ర‌జ‌లను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *