ఇండియాకు త‌మవంతు సాయం చేస్తాము….

వాషింగ్ట‌న్‌:ఇండియాలో రోజురోజుకు విప‌రీతంగా పెరుగుతున్న కొవిడ్ వైర‌స్ సెకండ్ వేవ్ భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని, ఈ స్థితిని త‌ట్టుకునేందుకు ఇండియాకు చేత‌నైంత సాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అమెరికా చెప్పింది. శ‌నివారం మీడియాతో మాట్లాడిన యూఎస్ చీఫ్ మెడిక‌ల్ అడ్వ‌యిజ‌ర్ డాక్ట‌ర్ ఆంథ‌నీ ఫాసీఈ వ్యాఖ్య‌లు చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకుల ఎగుమ‌తిపై అమెరికాలో విధించిన నిషేదం ఎత్తేయాల‌ని, ఆ స‌రుకుల‌ను భార‌త్‌కు అందేలా చూడాల‌ని కొన్ని రోజులుగా అగ్ర‌రాజ్యాన్ని భార‌తదేశం కోరుతోంది. అయితే వీటిపై అమెరికా వైపు నుండి ఎటువంటి స్పంద‌నా రాలేదు. ఈ క్ర‌మంలో ఆంథ‌నీ ఫాసీ మాట్లాడుతూ.. ఇండియాలో ప‌రిస్థ‌తి భ‌యంక‌రంగా ఉంది. మేం చేయ‌గ‌లిగిన సాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం ఆ ప‌రిస్థితిని త‌ట్టుకోవాలంటే అక్క‌డి ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సినేష‌న్ చేయ‌క‌త‌ప్ప‌దు.అలాగైతేనే ఆ ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగేది అని ఫాసీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *