4ల‌క్ష‌ల కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు ఏపీకి చేరాయి

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మే1 నుండి 18నుండి 45 ఏళ్లు నిండిన వారికి కొవిడ్ టీకా అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఈ సంద‌ర్భంలో విజ‌య‌వాడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి మ‌రో 4ల‌క్ష‌ల క‌రోనా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్ టీకాలు.. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలోరాష్ట్రానికి చేరాయి. వ్యాక్సిన్ డోసుల‌ను అధికారులు గ‌న్న‌వ‌రంలోకి రాష్ట్ర టీకా నిల్వ‌కేంద్రానికి త‌ర‌లించారు. ఈ వ్యాక్సిన్లు గ‌న్న‌వ‌రం రాష్ట్ర టీకా కేంద్రం నుండి వైద్య‌, ఆరోగ్య‌శాఖ ఆదేశాల‌తో జిల్లాల‌కు త‌ర‌లివెళ్ల‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *