పిల్లి క‌ళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా ప‌రిపాల‌న చేస్తున్నారు….

హైద‌రాబాద్‌: ష‌ర్మిక ల మ‌రోసారి సీఎంకేసీఆర్ పై ఫైర్ అయింది. పిల్లి క‌ళ్లు మూసుకొని పాలు తాగిన‌ట్లు, కేసీఆర్ క‌ళ్లు, చెవులు మూసుకొని ప‌రిపాల‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.చిన్న‌సారు కేటీఆర్ కు కొవిడ్ క‌ష్టాలు అస‌లే క‌న‌ప‌డ‌వు అంటూ చుర‌క‌లంటించారు.రెమిడేసివిర్ కోసం జ‌నం చాంతాడంత క్యూలు క‌డుతున్నార‌ని, అయినా ఈ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేద‌ని, 3500 ఇంజ‌క్ష‌న్ 40 వేల‌కు కొంటున్నామ‌ని జ‌నం మొత్తుకుంటున్నా, ప్ర‌భుత్వానికి వినిపించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఆక్సిజ‌న్ లేక కొవిడ్ రోగులు చ‌స్తుంటే త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తండ్రీ కొడుకులు త‌మ గార‌డి మాట‌ల‌ను ప‌క్క‌న పెట్టి, మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి నిల‌పాల‌ని ష‌ర్మిల హిత‌పు ప‌లికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *