క‌రోనా వ‌ల‌న రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై కేసీఆర్ స‌మీక్ష‌….

హైద‌రాబాద్‌: ప‌్ర‌స్తుతం క‌రోనా సెకండ్‌వేవ్ వేగం వ్యాప్తిస్తుంద‌ని తెలిసిన విష‌య‌మే. రాష్ట్రంలో నెల‌కొన్న ఆర్థిక ప‌రిస్థితులు ,ప్ర‌జ‌ల జీవితాలు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. కొవిడ్ వైర‌స్ పై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో సీఎం స‌మావేశ‌మ‌య్యారు. కొవిడ్ రోగుల‌కు చికిత్స‌,బ్లాక్ ఫంగ‌స్‌, ఔష‌ధాలు, టీకాల‌పై కేసీఆర్ వారితో చ‌ర్చిస్తున్నారు. ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్,మందులు స‌ర‌ఫ‌రాతో పాటు బెడ్ల కేటాయింపు త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న స‌మీక్షిస్తున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ‌లుతీరు, ఎద‌రుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై అధికారులతో సీఎం చ‌ర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *