క‌రోనా టీకా కొనుగోలు వివ‌రాలివ్వండి- కేంద్రానికి సుప్రీం కోర్టు…

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం సుమోటోగా విచారించింది. ఏయే రోజు ఏ వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తైన వ్యాక్సినేష‌న్ వివ‌రాలు ఇవ్వాల‌ని సుప్రీం ఆదేశించింది. దేశంలో మిగ‌తా వారికి ఎప్పుడు వ్యాక్సినేష‌న్‌ను పూర్తి చేస్తార‌ని సుప్రీం కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ల‌ను ఉచితంగా ఇస్తున్నారా? లేదా? అన్న సంగ‌తిపై అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేయాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే బ్లాక్‌ఫంగ‌స్ ఔష‌ధాలు ల‌భ్య‌త‌కు ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారో చెప్పాల‌ని సుప్రీం కేంద్రాన్ని కోరింది. ఈ విష‌యంపై త‌దుప‌రి వివ‌చార‌ణ‌ను ఈనెల 30కి వాయిదా వేసింది.కొవాగ్జిన్‌, కోవిషీల్డ్, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *