తెంగాణ‌లో మూడు కంపెనీల్లో వ్యాక్సిన్ – కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్‌: కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కోఠిలోని ఈఎస్‌టి ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న ముచ్చ‌టిస్తూ బ్లాక్‌ఫంగ‌స్ గ‌తంలో సంవ‌త్స‌రానికి ఒక కేసు ఈఎన్‌టికి వ‌చ్చేంద‌ని, ప్ర‌స్తుతం కొవిడ్‌తో భారీగా కేసులు న‌మోదు అవుతున్నాయ‌న్నారు. అంపోట‌రిస్ అనే ఇంజ‌క్ష‌న్లు కొర‌త ఏర్ప‌డింద‌ని , కేంద్ర ,రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని,11ఫార్మా కంపెనీలు ఇంజెక్ష‌న్ ఉత్ప‌త్తి చేస్తున్నాయ‌న్నారు. ఈనెల‌31 తేదీలోపు మూడు ల‌క్ష‌ల ఇంజెక్ష‌న్లు ఉత్ప‌త్తి అవుతాయ‌ని, విదేశాల నుండి జూన్ మొద‌టి వారంలో రెండు ల‌క్ష‌ల ఇంజెక్ష‌న్లు అందుబాటులో వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. 5690 ఇంజెక్ష‌న్లు కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి పంపింద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కిష‌న్ రెడ్డి సూచించారు.లాక్‌డౌన్ లో అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు రాకూడ‌ద‌న్నారు. 70శాతం యువ‌కులు కొవిడ్ భారిన ప‌డుతున్నార‌ని, త‌మికేమి కాద‌నే నిర్ల‌క్ష్యాన్ని వ‌దిలి పెట్టాల‌న్నారు. మ‌న‌దేశంలో 16 కంపెనీల‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని, తెంగాణ‌లో మూడు కంపెనీల్లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని తెలిపారు. డిసెంబ‌ర్ లోపు దేశంలో ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందుతుంద‌ని కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *