కొవిడ్ టీకా వేయించుకునేవారికి బంప‌ర్ ఆఫ‌ర్‌…

అహ్మ‌దాబాద్‌: ఇండియాలో కొవిడ్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా ల‌క్ష‌కుపైగా తాజా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో గ‌త ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి కాలుమోపిన్ప‌టి నుంచి కూడా ఒకేరోజు ల‌క్ష‌కు పైగా తాజా కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశాయి. అయితే ప్ర‌జ‌ల్లో చాలామంది టీకాల‌పై అపోహాల‌తో వ్యాక్సినేష‌న్‌కు ముందుకు రావ‌డంలేదు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెంచుతూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రోత్స‌హించేలా గుజ‌రాత్లోని రాజ్‌కోట్ నగ‌రంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌మ ప్రాంతంలోని వ్యాక్సినేష‌న్ కేంద్రంలో టీకా వేయించుకునే వారి కోసం బంప‌ర్ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ వేయించుకునే మ‌హిళ‌ల‌కు ఉచితంగా ముక్క‌పుల్ల ఇస్తామ‌ని, అదే పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే హ్యాండ్ బ్లెండ‌ర్ ఫ్రీగా ఇస్తామ‌ని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *