మ‌ళ్లీ ఇప్పుడు స‌యితం ప్ర‌భుత్వం అలాగే వ్య‌వ‌హ‌రిస్తోంది.. ..

హైద‌రాబాద్‌: గ‌త ఏడాది నుంచి ప్ర‌జ‌ల‌ను పీడిస్తోన్న మ‌హ‌మ్మారి క‌రోనా అంద‌రికి తెలిసిన విష‌య‌మే. కొవిడ్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రోసారి అదే త‌ప్పు చేస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఒక‌వైపు చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో క‌రోనా విలయ‌తాడ‌వం చేస్తుంటే … స‌రిహ‌ద్దుల్లో అప్ర‌మ‌త్తం చేయ‌కుండా అదే ఆశ్ర‌ద్దంగా ప్ర‌ద‌ర్శిస్తోంది. గ‌త సంవ‌త్స‌రం క‌రోనా మొద‌టి సారి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలాగే అవ‌గాహ‌నా రాహిత్యాన్ని ఆశ్ర‌ద్ధాను ప్ర‌ద‌ర్శించి తెలంగాణ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌ల‌కు గురైంది. వంద‌లాది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యారంటూ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని దోషిగా చూశారు. మ‌ళ్లీ ఇప్పుడు స‌యితం ప్ర‌భుత్వం అలాగే వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌హారాష్ట్ర ,క‌ర్నాట‌క‌, చ‌త్తీస్‌గ‌డ్ మూడు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరిగాయి. ఈ మూడు తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఉన్నాయి. అయినా స‌రిహ‌ద్దుల్లో వ‌చ్చేవారిని ఆపి ప‌రీక్ష‌లు చేయ‌డం లాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేదు. చెక్ పోస్టుల ద‌గ్గ‌ర టెస్టులు చేయ‌డంలేదు. అయితే టెస్టుల సంఖ్య పెంచాల‌ని ఆదేశాలు మాత్రం జారీ చేసింది. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ అంద‌రికీ అందేలా చూడాల‌ని మంత్రి ఈటెల రాజెంద‌ర్ వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాక్టిక‌ల్‌గా స‌రిహ‌ద్దుల్లో మాత్రం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *