రాష్ట్రంలో తాజాగా 2,524 కేసులు న‌మోద‌య్యాయి…..

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో తాజాగా 2,524 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో 18మంది మృతి చెందారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనాతో 3,281 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. సోమ‌వారం న‌మోదయిన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో 5,78,351 క‌రోనా కేసులు చేరాయి. ఇప్పుడు తెలంగాణ‌లో 34,084 యాక్టివ్ కేసులున్నాయి. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 5,40,986 మంది రిక‌వ‌రీ అయ్యారు.మ‌రోవైపు రెండో ద‌శ‌లో క‌రోనా ఎన్నో కుటుంబాల‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు పెట్రేగిపోతున్న విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనాసెకండ్ వేవ్ లో ఎన్నో కుటుంబాల‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. చాలా కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందుల‌కు గురైతున్నారు. ఏమీ చేయాల‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. త‌ల్లిదండ్రులిద్ద‌రినీ కోల్పోయిన ముక్క‌ప‌చ్చ‌లార‌ని పిల్లల దుస్థితి అయితే క‌న్నీరు పెట్టిసోతంది. రోజుల వ్య‌వ‌ధిలోనే క‌న్న‌వారు మ‌ర‌లిరాని లోకాల‌కు వెళ్ల‌డంతో అప్ప‌టిదాకా ఏలోటూ లేకుండా ఆనందంగా గ‌డిపిన ఆ చిన్నారులు ఒక్క‌సారిగా దిక్కులేనివార‌వుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *