భార‌త్ కు భారీ విరాళం ఇచ్చిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌….

ముంబై: భార‌త్ ప్ర‌భుత్వానికి మిలియ‌న్ డారర్లు (రూ.7.5 కోట్లు) విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 2021 సిజ‌న్‌14లో ఐపీఎల్ జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొవిడ్‌మ‌హ్మ‌మారి పోరాటంలో భాగంగా త‌న వంతు సాయం చేసింది. ఆట‌గాళ్ల‌తోపాటు జ‌ట్టు య‌జ‌మానులు, జ‌ట్టు మేనేజ్‌మెంట్ ముందుకు వ‌చ్చి విరాళాలు సేక‌రించారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు చెందిన రాయ‌ల్ రాజ‌స్థాన్ ఫౌండేష‌న్ (ఆర్ ఆర్ ఎఫ్‌), బ్రిటిష్ ఏషియ‌న్‌ట్ర‌స్ట్ (బీఏటీ) తో క‌లిసి ప‌ని చేశారు. అని టీమ్ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే బీఏటీ భార‌త ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తోంది. ముఖ్యంగా ఆ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్ ప్రిన్స్ చార్లెస్‌.. ఆక్సిజ‌న్ ఫ‌ర్ భార‌త్ ఎమ‌ర్జెన్సీ అప్పీల్ చేశారు. అని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు తెలిపింది. రాయ‌ల్స్ జ‌ట్టు ఇచ్చిన విరాళం మొత్తం దేశంలోస‌హాయ కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌నున్న‌ట్లు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *