క‌రోనా రోగుల‌కు అండ‌గా క్ర‌యోజెనిక్ ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు….

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజు క‌రోనా రోగులు ఆక్సిజ‌న్ లేక ప్రాణాలు గాలీలో క‌లిసిపోతున్నాయ‌ని తెలిసిన విష‌య‌మే. ఈ సంద‌ర్బంలో మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్‌క్ట‌క్చ‌ర్ కంపెనీ లిమిటెడ్ కొవిడ్ రోగుల‌కు అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్య‌త లో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి (11) క్ర‌యోజెనిక్ ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను విరాళంగా ఇస్తామ‌ని మెయిల్ (మెఘా ఇంజ‌నీరింగ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీ లిమిటెడ్)హామీ ఇచ్చింద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. బ్యాంకాక్ నుంచి IL. 76 ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ క్రాప్ట్ ద్వారా వ‌చ్చిన‌3 క్ర‌యోజెనిక్ ట్యాంక‌ర్ల‌ను స్వీక‌రించి ఆక్సిజ‌న్ నింప‌డానికి ఒడిశాకు రైలులో వెళ్లే ట్యాంక‌ర్ల‌ను బేగంపేట వైమానిక ద‌ళం స్టేష‌న్ వ‌ద్ద శ‌నివారం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్లాగ్ అఫ్ చేశారు. మొద‌టి బ్యాచ్ 3 ట్యాంక‌ర్లు హైద‌రాబాద్ కు వ‌చ్చాయ‌ని, బంగాళాఖాతంలో అవాంత‌రాలు ఉన్నందున మిగిలిన ట్యాంక‌ర్లు 3నుంచి 4 రోజుల్లో వ‌స్తాయ‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తెలిపారు. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు, రాష్ట్రంలోని క‌రోనా రోగుల‌కు ఎంటువంటి కొర‌త లేకుండా త‌గురీతిలో ఆక్సిజ‌న్ ప‌నిచేస్తున్నార‌ని, రాష్ట్రంలోని కొవిడ్ రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఆక్సిజ‌న్ ప్లాంట్లు ,స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం , ట్యాంక‌ర్ల సేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *