గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మాస్క్‌లు ధ‌రించ‌కుంటే క‌ఠిన చ‌ర్య‌లు…

హైద‌రాబాద్:న‌గ‌రంలోని క‌రోనా విల‌య‌తావం చేస్తుంద‌ని తెలిసిన‌వ విష‌య‌మే. జీహెచ్ఎంసీ కొవిడ్ విజృంభిస్తున్న సంద‌ర్భంగా మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌తేన‌గ‌ర్‌లోమాస్క్ లేకుండా క‌స్ట‌మ‌ర్స్‌ను షాపులోకి అనుమ‌తించిన ఓ షాపు య‌జ‌మానికి2 వేల జ‌రిమానా విధించారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌ను ఉప‌క్ర‌మించిన సంగ‌తితెలిసిందే. మ‌రింత ప‌క‌డ్బందిగా కొవిడ్ నిబంధ‌న‌ల అమ‌లులో భాగంగా ,…మాస్క్ ధ‌రించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. బ‌హిరంగ ప్ర‌దేశాలు, ప‌ని ప్రాంతాలు , ప్ర‌జా ర‌వాణా వాహానాల్లో ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మాస్క్ ధ‌రించ‌ని వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం- 2005 లోని 51నుంచి 60 సెక్ష‌న్ల‌తో పాటు ఐపీసీ 188 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఆ చ‌ట్టాల ప్ర‌కారం1000 జ‌రిమానాతో పాటు ఆరు నెల‌ల జైలు శిక్ష విధించే అధికారం ఉంది.ఇక హోలీ వేడుక‌ల‌ను బ‌హిరంగంగా జ‌రుపుకోవ‌డాన్ని కూడా స‌ర్కార్ నిషేధించింది. దీనితో పాటు ష‌బ్‌- ఏ- బ‌రాత్ , ఉగాది, శ్రీ‌రామ‌న‌వ‌మి ,మ‌హావీర్ జయంతి, గుడ్‌ప్రైడే, రంజాన్‌, త‌దిత‌ర పండుగ‌ల వేడుల‌క‌పైనా ఏప్రిల్ 30వ‌ర‌కు ఆంక్ష‌లు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *