కొవిడ్ టీకా రెండో రోజు కొన‌సాగుతోంది…..

హైద‌రాబాద్: తెలంగాణ‌లో కొవిడ్ టీకా పంపిణీ రెండో రోజు కొన‌సాగుతోంది. ఆదివారం సెల‌వు కావ‌డంతో సోమ‌వారం తిరిగి టీకాల పంపిణీ చేపట్టారు. రెండో రోజు 184 కేంద్రాల‌ను కొత్త‌గా నెల‌కొల్చారు. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 324 కు పెరిగింది. రెండో రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్య సిబ్బందికి టీకా వేయ‌నున్న‌ట్లు ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ జి. శ్రీ‌నివాస్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టీకా కేంద్రాలు అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లో 42ఉండాగా…10 కంటే ఎక్కువ‌గా టీకా పంపిణీ కేంద్రాలున్న జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ (13),భ‌ద్రాద్రి కొత్త‌గూడెం (14),ఖ‌మ్మం (15),మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (11),మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి(11), న‌ల్గొండ (18), నిజామాబాద్ (14), రంగారెడ్డి (14),సంగారెడ్డి(12), సిద్దిపేట (12),సూర్యాపేట‌(10), వ‌రంగ‌ల్ న‌గ‌రం (14) జిల్లాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *