తెలంగాణ ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ కోసం- యుద్ధ విమానాల‌కు అనుమతి

హైద‌రాబాద్‌: వైద్య ఆరోగ్య‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఏ టెస్ట్ చేసినా కొవిడ్ పాజిటివ్ అనే స్తోంద‌న్నారు. ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్రాణాలు పోతున్నాయ‌ని, నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని కోరారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లోకి ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని, 80 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను తెప్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ‌లో కొవిడ్ టెస్ట్ కిట్ల కొర‌త లేద‌ని, ప‌డ‌క‌లు, టీకాలు ,మందులూ అన్నీ అందుబాటులోనే ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. కొవిడ్‌ అడ్డం పెట్టుకొని దోపీడి చేసే ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై మాత్రం చర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈట‌ల రాజేంద‌ర్ హెచ్చ‌రించారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధ
విమానాల‌ను అనుమ‌తిస్తోంది. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌తో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు బ‌య‌ల్దేరి వెళ్లాయి భువ‌నేశ్వ‌ర్ నుండి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8ఖాళీ ట్యాంకుల‌ను హైద‌రాబాద్ నుండి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ,సీఎస్ సోమేష్‌కుమార్ బేగంపేట విమానాశ్ర‌యంలో ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *