రాష్ట్రంలో తాజా 7,994 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు..

హైద‌రాబాద్‌: క‌రోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 7,994 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని రాష్ట్ర వైద్య ,ఆరోగ్య‌శాఖ గురువారం హెల్త్ బులిటెన్‌లోతెలిపింది. వైర‌స్ బారినుండి కొత్త‌గా 58మంది ప్రాణాల‌ను కోల్పోయారు. నిన్న 4,009 మంది బాధితులు కోలుకొని ఇండ్ల‌ను వెళ్లాని పేర్కొంది. తాజాగా న‌మోదైన కేసుల‌లో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 76 వేలు దాటాయి. ఇప్పుడు 76,060 యాక్టివ్ కేసులున్నాయ‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ తెలిపింది. 24 గంట‌ల్లో రాష్ట్రంలో 80,181 మందికి ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పింది. అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 1,630 కేసులు న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్‌లో615, రంగారెడ్డి లో 558, న‌ల్గండ‌లో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్ లో 301,సూర్య‌పేట‌లో 264, సిద్దిపేట‌లో 269, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో 263, జగిత్యాల‌లో 238, ఖ‌మ్మంలో 213, మంచిర్యాల‌లో 201 క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. తాజాగా న‌మోదైన కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960 కి పెర‌గా… ఇప్ప‌టి వ‌ర‌కు3,49,692 మంది కోలుకున్నారు. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మొత్తం 2,208 మంది ప్రాణాలు విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *