45 సంత‌వ్స‌రాలు దాటిన ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్ టీకాను తీసుకోవాలి….

న్యూఢిల్లీ: 45 సంవ‌త్స‌రాలు దాటిన ప్ర‌తి ఒక్క‌రికి టీకా తీసుకోవాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఈరోజు మీడియాతో ఈ సంగ‌తీన్ని తెలిపారు. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 45 సంవ‌త్స‌రాఉ దాటిన‌వారంద‌రికీ టీకా పంపిణీ చేయ‌నున్నారు. అర్హులైన వారంద‌రూ టీకా కోసం న‌మోదు చేసుకోవాల‌ని, కోవిడ్ తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. క‌రోనా కేసులు పెరుగుతున్న సంద‌ర్భంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 60 సంవ‌త్స‌రాలదాటిన వారికి, 45 సంవ‌త్స‌రాలు దాటి వ్యాదులు ఉన్న‌వారికి మాత్ర‌మే ఇప్పుడు టీకాలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. శాస్త్ర‌వేత్తుల‌, ప్ర‌పంచ‌శాస్త్ర సంఘాల సూచ‌న మేర‌కు కోవిడ్ టీకా రెండ‌వ డోసును నాలుగు నుంచి 8వారాల మ‌ధ్య తీసుకోవ‌చ్చుఅని మంత్రితెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ఈ నియమం వ‌ర్తిస్తుంద‌న్నారు. 45 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *