రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త‌గా 6,206 కేసులు న‌మోదు…

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా దినాదిన గండం మారింది. గ‌త కొన్ని రోజులుగా రోజువారీ క‌రోనా పెరుగుతూ వ‌స్తున్నాయి. కొత్తాగా గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో తాజాగా 6,206 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్యశాఖ నేడు హెల్త్ బులిటెన్ లో తెలిపింది. అలాగే 29 మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా మ‌హ‌మ్మారి నుంచి3,052 మంది కోలుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయ‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పింది. ఇదిలా ఉండ‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. 24 గంట‌ల్లో 1,005 కొవిడ్ కేసులు రికార్డ‌య్యాయ‌ని ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ త‌రువాత అత్య‌ధికంగా మేడ్చ‌ల్‌లో 502, రంగారెడ్డి, 373, నిజామాబాద్ 406, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌271 ,జ‌గిత్యాల‌257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *