క‌ల‌వపెడుతున్న క‌రోనా కేసులు -24 గంట‌ల్లో 3.46 ల‌క్ష‌ల‌ కేసులు

న్యూఢిల్లీ: ఇప్పుడు కొవిడ్ విలాయ‌తాడ‌వం చేస్తుంది. రోజురోజుకు క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఆందోళ‌న‌కు గురి చేస్తున్నది. సెకండ్ వేవ్‌లో మ‌హ‌మ్మారి రెట్టింపు వేగంతో విస్త‌రిస్తుండ‌డంతో ప్ర‌పంచ‌రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు శనివారం మూడు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు , రెండువేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యా. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా… 7 వేల‌కుపైగా జ‌నం ప్రాణాలు వ‌దిలారు. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 3,46,786 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర కుటుంబ ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ తెలిపింది.మ‌రో 2,624 మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పింది. కొత్త‌గా 2,19,838 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా న‌మోదైన కేసుల‌తో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481 కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు1,38,67,997 మంది కోలుకున్నారు. మొత్తం 1,89,544మంది మ‌హ‌మ్మారితో మృతి చెందారు. ఇప్పుడు భార‌త‌దేశంలో 25,52,940 యాక్టివ్ కేలుసున్నాయ‌ని తెలిపింది. మ‌రో వైపు భార‌త‌దేశంలో వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రంగా సాగుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు టీకా డ్రైవ్‌లో 13,83,79,832 డోసులు వేసిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వివ‌రించింది. ఇదిలా ఉండ‌గా దేశంలో క‌రోనా టెస్టులు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు17.53ల‌క్ష‌ల శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్లు ఇండియన్ కౌన్సిల్ ఫ‌ర్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 27.61 ల‌క్ష‌ల న‌మూనాల‌ను ప‌రిశీలించిన‌ట్లు వివ‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *