రాష్ట్రంలో తాజాగా 6,361 కొవిడ్ కేసులు…

హైద‌రాబాద్‌: ‌తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మ‌హ‌మ్మారి దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 4,69,722కు పెర‌గ్గా ..ఇప్ప‌టి వ‌ర‌కు 3,09,491 మంది కోలుకున్నారు.మ‌రో 2,527 మంది మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ప్రాణాలు విడిచారు.ఇప్పుడు రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులున్నాయ‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ వివ‌రించింది.కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 1,225,మేడ్చ‌ల్ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి.రాష్ట్రంలో కొవిడ్ క‌ర‌ళ‌నృత్యం చేస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లోతాజాగా 6,361 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయ‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ బుధ‌వారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. కొత్త‌గా వైర‌స్ బారిన‌ప‌డి మ‌రో 51 మంది మ‌ర‌ణించారు. తాజాగా క‌రోనా నుండి 8,126 మంది కోలుకొని ఇండ్ల‌కు వెళ్లార‌ని ఆరోగ్య‌శాఖ పేర్కొంది. మంగ‌ళ‌వారం ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వ‌హించ‌గా..6,361 క‌రోనా కేసులు రికార్డ‌య్యాయ‌ని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *