రాష్ట్రంలో 7,430 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు…

ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తిస్తుంద‌ని అంద‌రికి తెలిపిన విష‌య‌మే . తెలంగాణ రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో 7,430 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌4,50,790 కి చేరింది. తాజాగా 56మంది కోలుకొని ఇండ్ల‌కు వెళ్ల‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56మంది మృతి చెంద‌గా. మొత్తం మృతుల సంఖ్య 2,368 కు పెరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో 80,695 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 76,330 కొవిడ్ శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్లు పేర్కొంది. తాజాగా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా గ్రేట‌ర్ హైద‌బాద్ జీహెచ్ ఎంసీలో 1,546 న‌మోద‌వ‌గా… మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 533, రంగారెడ్డిలో 475, న‌ల్గొండ‌లో 368, సంగారెడ్డిలో 349, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 321, నిజామాబాద్‌లో 301, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 279, క‌రీంన‌గ‌ర్‌లో 272, జాగిత్యాల‌లో 226, సిద్దిపేట‌లో 242, వికారాబాద్‌లో 203 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *