కొవిడ్ కార‌ణంగా బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం…

ముంబ‌యి: భార‌త‌దేశంలో కోవిడ్ మ‌హ‌మ్మారి మ‌రోసారి విలయ‌తాండ‌వం చేస్తోంది ఇలాంటి సంద‌ర్బంలో బీసీసీఐ కీలక నిర్ణ‌యం తీసుకంది. దేశంలో అన్ని వ‌యో విభాగాల క్రికెట్ టోర్న‌మెంట్‌ల‌ను ర‌ద్దు చేసింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వినూ మ‌న్క‌డ్ ట్రోపితో స‌హా అన్ని టోర్న‌మెంట్లను ర‌ద్దు చేస్తే నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషాఅన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డుల‌కు స‌మాచారం అందించారు. అహ్మ‌దాబాద్‌లోని మొతేరా వేదిక‌గా భార‌త్- ఇంగ్లాండ్ టీ20 సిరీస్ జ‌రుగుతున్న తెలిసిందే. కొవిడ్ ఉద్ధృతి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన మూడో టీ20 ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రిగింది. మిగ‌తా మ్యాచ్‌ల‌ను కూడా ప్రేక్ష‌కులు లేకుండానే నిర్వ‌హించ‌నున్న‌ట్లు గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ ఇప్ప‌టికే తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *