ఫంగ‌స్‌ను రంగుల‌తో పిల‌వొద్దు – డాక్ట‌ర్ ర‌ణ్‌దీఫ్ గులేరియా

ఢిల్లీ: దేశం వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విలయ‌తాడ‌వం చేస్తున్నా సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు దెబ్బ మీద దెబ్బ ప‌డిన‌ట్లుగా మాన‌వాళికి ఫంగస్ ఇన్పెక్ష‌న్లు స‌వాలుగా మారాయి. బ్లాక్ ఫంగ‌స్, వైట్ ఫంగ‌స్‌.. కొత్త‌గా ఎల్లో ఫంగ‌స్ మ‌న‌ల్ని క‌ల‌వ‌పెడుతోంది. ఫంగ‌స్‌ను రంగుతో పిలిచే బ‌దులు, వాటి ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్ల పేరుతో సంబోంధించాల‌ని, రంగులతో వాటిని పిల‌వొద్దుంటూ స్ప‌ష్టం చేశారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా. సోమ‌వారం నిర్వ‌హించిన ప్రెస్‌కాన్ప‌రెస్‌లో ఆయ‌న ముచ్చ‌టిస్తూ.. ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్ల‌కు సంబంధించి అనేక అంశాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి. ఫంగ‌స్‌కు సంబంధించి వాటి స‌రైన పేరే వాడ‌టం మంచిది. ఎందుకంటే మ‌న శ‌రీరంలో వివిధ భాగాల్లో ఫంగ‌స్ ఒక్కో రంగులో క‌నిపిస్తుంటుంది. బ్లాక్ ఫంగ‌స్ అనేది వాటి మూలాల‌లో తెల్ల‌టి ఫంగ‌స్ కాల‌నీలు, న‌ల్ల‌టి చుక్కల‌తో క‌నిపిస్తుంది. బ‌ల‌హీన‌మైన రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉన్న‌వారిలో మ్యూక‌ర్ మైకోసిస్, కాండిడా, ఆస్పెర్‌గిల్ల‌స్ వంటి ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్లు సాధార‌ణంగా క‌నిపిస్తాయి. దేశంలో క‌రోనా రోగుల్లో ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్ కేసులు అధిక శాతం మ్యూక‌ర్ మైకోసిస్‌వే, గ‌తంలో ఎప్పుడూ ఆసుప‌త్రిలో చేర‌ని క‌రోనా రోగుల్లో సైతం ఇది క‌నిపిస్తుంటుంది. ఇంట్లోనే స్టెరాయిడ్స్ తీసుకునే డ‌యాబెటిక్ రోగుల్లోనూ ఈ వ్యాధి వ‌స్తుంది. క‌రోనా నుండి కోలుకున్న రోగుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 9 వేల కేసులు ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్లు న‌మోద‌య్యాయి. స‌వాలుగా మారింది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌తో పాటు కొవిడ్ సోక‌ని రోగుల‌కు మ్యూక‌ర్ మైకోసిస్ వార్డులు అవ‌స‌రం ఉంటాయి. దిల్లీలోని ఎయిమ్స్ లో అధిక శాతం మంది మ్యూక‌ర్ మైకోసిస్ రోగుల‌కు ఆసుప‌త్రిలోచేరే తొలిద‌శ‌లోనే గుర్తిస్తున్నాం. అని గులెరియా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *