దేశా రాజ‌ధాని వ‌ణికిస్తున్న క‌రోనా…

న్యూఢిల్లీ: ఢిల్లీ న‌గ‌రాన్ని వ‌ణికిస్తున్న కొవిడ్‌, దినాదినా గండంగా మారింది.నాలుగో ద‌శ తీవ్ర ఆందోళ‌న రేపుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో తాజాగా 25 వేల‌కుపైగా కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ రెండు రోజులనే 25,462 కొవిడ్ కేస‌లు,161 మ‌ర‌ణాలు రిపోర్ట్ అయ్యాయి. దీంతోఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,53,460కు మ‌రణాల సంఖ్య 12,121 కు పెరిగింది.మ‌రోవైపు ఢిల్లీలోగ‌త 24 గంట‌ల్లో 20,159 మంది కొవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్న‌వారి మొత్తం సంఖ్య 7,66,398 కు చేరింది. ఇప్పుడు 74,941 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ తెలిపింది. క‌రోనా పాజిటివిటి రేటు 20.74శాతం, మ‌ర‌ణాల రేటు 1.42 శాత‌మ‌ని పేర్కొంది. కాగా, ఢిల్లీలో క‌రోనా రోగుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల కొర‌త ఏర్ప‌డుతున్న‌ది. ఈ సంద‌ర్బంలో కామ‌న్‌వెల్త్ గేమ్స్ గ్రామంలో క‌రోనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆదివారం దీనిని సంద‌ర్శించారు. యమునా స్పొర్ట్స్ కంపెక్స్‌లో 800 ఆక్సిజ‌న్ బెడ్లు, ఇత‌ర చోట్ల మ‌రో 500 ఆక్సిజ‌న్ బెడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. మంగ‌ళ‌వారం నాటికి అద‌నంగా 1400-2000 బెడ్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *