కొత్త‌గా 394 పాజిటివ్ కేసులు తెలంగాణ లో న‌మోదు…

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంట‌ల వ‌ర‌క 40,190 క‌రోనా వైర‌స్ నిర్థ‌ర‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 394 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,87,502 కి చేరింది. ఈమేర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ ఆదివారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న క‌రోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,549కి చేరింది. క‌రోనాబారి నుంచి నిన్న 574మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 2,80,565కి చెరింది. ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 5,388 ఉండ‌గా వీరిలో 3,210 మంది హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 69,91,487కి చెరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *