ఈసారి ఇండియాలోనే మ‌రో డేంజ‌ర‌స్ క‌రోనా మ్యుటేష‌న్ …

ముంబై: యూకేలో క‌నిపించిన క‌రోనా కొత్త స్ట్రెయిన్‌ను చూసి ప్ర‌పంచ‌మంతా వ‌ణుకుతోంది. అయితే అంతే ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌రో క‌రోనా మ్యుటేష‌న్ ఇండియాలోనే క‌నిపించడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముంబై మెట్రోపాలిట‌న్ రీజియ‌న్‌కు చెందిన ముగ్గురు క‌రోనా పేషెంట్ల శాంపిల్స్ లో ఈ మ్యుటేష‌న్‌ను క‌నుగొన్న‌ది. ఖ‌ర్గార్‌లోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్. దీనికి E48K మ్యుటేష‌న్‌గా పిలుస్తున్నారు. సౌతాఫ్రికాలో క‌నిపించిన మూడు మ్యుటేష‌న్ల (K417N, E484K and N501Y) లో ఇదీ ఒక‌ట‌ని ఇక్క‌డి అసోసియేట్ ప్రొఫెస‌ర్ నిఖిల్ ప‌ట్కార్ వెల్లడించారు. మొత్తం 700 శాంపిల్స్‌కు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తుండ‌గా… అందులో ముగ్గురిలో ఈ మ్యుటేష‌న్ క‌నిపించిన‌ట్లు చెప్పారు. ఇది శ‌రీరంలోని యాంటీ బాడీస్‌ను బోల్తా కొట్టిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు తెలిపారు.
యూకే వేరియంట్ కంటే డేంజ‌ర్‌
అంద‌రి దృష్టీ యూకే వేరియంట్‌పై ఉంది కానీ…. దాని కంటే సౌతాఫ్రికాలో క‌నిపించిన ఈE484K ఇంకా ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తోంది. వ్యాక్సిన్ ప్ర‌ధానంగా యాంటీ బాడీల‌ను వృద్ధి చేస్తుంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఆ యాంటీ బాడీల‌నే బోల్తా కొట్టిస్తుండ‌టం వ‌ల్ల అస‌లు వ్యాక్సినేష‌న్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌వీ ముంబై,పాన్వెల్, రాయ్‌గ‌డ్‌ల‌లోని కొవిడ్ పేషెంట్లు గ‌త సెప్టెంబ‌ర్‌లో కొవిడ్ బారిన ప‌డిన‌ట్లు డాక్ట‌ర్ నిఖిల్ ప‌ట్కార్ చెప్పారు. వీళ్ల‌కు చాలా స్వ‌ల్ప‌మైన ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్న‌ట్లు గుర్తించారు.ఇద్ద‌రు కేవ‌లం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండ‌గా… ఒక మాత్రం ఆసుప‌త్రిలో సాధార‌ణ చికిత్స తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *