కొత్త చ‌ట్టాల‌తో రైతుల జీవిత‌మే దుర్బ‌రం…..

న్యూఢిల్లీ: రైతుల‌తో కేంద్ర‌ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చ‌ర్చ‌లు జ‌రిపి, ఓ తుది నిర్ణ‌యానికి రావాల‌ని ఆయ‌న సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టాల‌ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేయ‌డ‌మే అంతిమ ప‌రిష్కార‌మ‌ని, వాటిని చెత్త‌బుట్ట‌లో ప‌డేయాల‌ని మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ… రైతులు త‌మ ఇళ్ల‌కు వెళ్లిపోతార‌ని ప్ర‌భుత్వం అనుకోకూడ‌ద‌ని అన్నారు. రానూ రానూ ఈ ఆందోళ‌న మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, అయితే ఇలా పెర‌గాల‌ని తాము ఏమాత్రం కోరుకోవ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రైతు ఆందోళ‌న మ‌రింత పెర‌గాల‌న్న‌ది త‌మ అభిమ‌తం కాద‌ని, దీనికి ఓ శాశ్వ‌త పరిష్కారం రావాల‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌ని రాహుల్ పేర్కొన్నారు. ఎర్ర‌కోట‌లోకి వారిని అస‌లు ఎందుకు అనుమ‌తించారు? వారిని ఎందుకు అడ్డుకోలేదు?ఇలా అనుమ‌తించ‌డం వెనుక ఉన్న ఉద్దేశాలేంది? ఈ విష‌యాల‌ను హోంమంత్రిని అడ‌గాలి.అని రాహుల్ పేర్కొన్నారు. కొత్త చ‌ట్టాల‌తో రైతుల జీవిత‌మే దుర్బ‌ర‌మ‌య్యే అవ‌కాశాలన్నాయ‌ని ,అందుకే రైతులు ఇంత‌లా ఆందోళ‌న చేస్తున్నార‌ని వివ‌రించారు. కేంద్ర ద‌ర్యాప్తు బృందాల‌ను ఉప‌యోగించి కేంద్రం రైతుల‌ను భ‌య‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. నూత‌న చ‌ట్టాల‌తో మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డ‌తారని, ఈ చ‌ట్టాల‌తో నిత్యావ‌స‌ర ధ‌ర‌ల స‌రుకులు ఆవాశాన్నంటే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొన్నారు. రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హరిస్తున్న తీరు నేర‌పూరిత‌మైన‌దే. మీరు రైతుల‌ను కొడుతున్నారు. భ‌య‌పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. కించ‌ప‌రుస్తున్నారు. అని రాహుల్ మండిప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *