ప‌లు కుటుంబాల‌కు వైఎస్సార్ బీమా ప‌థ‌కం…

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహాన్‌రెడ్డి వైఎస్సార్ బీమా ప‌థ‌కం కింద ప‌లు కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన 12,039 కుటుంబాల‌కు రూ.254 కోట్ల సాయం అందించిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం వారికి తోడుగా ఉండాల‌నే మంచి ఉద్దేశంతోనే ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని చెప్పారు. గ‌త సంవ‌త్సరం ప్ర‌భుత్వం త‌ర‌పు నుంచి రూ.510 కోట్లు ప్రీమియం క‌ట్టామ‌ని, ఈ సంవ‌త్స‌రం కూడా క‌ట్ట‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. ఇంకా 60ల‌క్ష‌ల అకౌంట్లు ఓపెన్ చేయాల్సిఉంద‌ని, దీనిపై ద‌ర్యాప్తు జ‌రిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని అధికారులు , జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *