ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌…

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు త్వ‌ర‌లో వేత‌నాలు పెంపు త‌న ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో అండ‌గా నిలిచి రాష్ట్ర సాథ‌ర్యంలో భాగ‌స్వాములైన ఆర్టీసీ ఉద్యోగుల‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్ వినిపించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ నేప‌థ్యంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మంలో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఆర్టీసీని కాపాడుతున్నాం. తెలంగాణ ఉద్య‌మంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి. ఆర్టీసీ ఉద్యోగ‌ల పాత్ర మ‌ర‌వ‌లేనిది. బ‌డ్జెట్ లో రూ. 3000 కోట్లు కేటాయించాం. ప్ర‌తి నెల నిధులు విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెంచిన‌ట్లే.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు కూడా వేత‌నాలు పెంచుతాం. రవాణాశాఖ మంత్రితో త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం. ఈ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *