రాష్ట్రంలో ప‌లు కీల‌క అంశాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌..మంత్రులు ,‌క‌లెక్ట‌ర్లు….

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించేందుకు ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు సోమ‌వారం ఉన్నత‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కొన‌సాగుతున్న ఈ స‌మావేశానికి మంత్ర‌లు,అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు హాజ‌ర‌య్యారు. రెవెన్యూ,పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్యారోగ్య‌, విద్య‌, అట‌వీశాఖ‌ల‌తోపాటు ఇత‌రశాఖ‌ల ముఖ్య‌మైన అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు. ప‌ల్లెప్ర‌గ‌తి,ప‌ట్ట‌ణ‌ప్ర‌గ‌తి, ధ‌ర‌ణి,తెలంగాణ‌కు హారిత‌హారం,గ్రామ‌గ్రామాన న‌ర్స‌రీల‌తోపాటు, క‌రోనా టీకా పంపిణీకి కార్యాచ‌ర‌ణ‌, విద్యాసంస్థ‌ల ప్రారంభంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మావేశంలో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. టీకాను అన్ని ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు అందించే కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నా. ప‌ల్లె ప్ర‌గ‌తి ,ప‌ట్ట‌ణ‌ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల అమ‌లును స‌మీక్ష‌స్తారు. రాష్ట్రంలో ఉద్య‌మంలా సాగుతున్న తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక‌స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.
కార్య‌క్ర‌మాన్ని గ్రామ‌గ్రామాన మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు ప‌ర‌చ‌డానికి సీఎం ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.
విద్యాసంస్థ‌ల పునఃప్రారంభంపై కీల‌క నిర్ణ‌యం!
రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల పునః ప్రారంభంపై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అవకాశం ఉంది.త‌ర‌గ‌తులు ఏవిధంగా నిర్వ‌హించాలి? ఇత‌ర రాష్ట్రాల్లో అనుస‌రిస్తున్న విధానంపై కూడా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. దీంతో విద్యాసంస్థ‌ల రీఓపెన్‌పై నేడు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రీక్ష‌లు
విధానంలో మార్పుల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. స‌ర్కార్ అనుమ‌తిస్తే ఈనెల 18లేదా 20వ తేదీ నుంచి
త‌ర‌గ‌తులు ప్రారంభిస్తామ‌ని విధ్యాశాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే త‌ర‌గ‌తులు ప్రారంభంపై ప్రభుత్వానికి
ఇంట‌ర్ బోర్డు ప్రతిపాద‌న‌లు పంపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *