ఏప్రిల్ 27 నుంచి మే నెల 31 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు…

హైద‌రాబాద్‌: ‌తెలంగాణ‌రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుండి మే నెల‌31 తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌ల‌కు సంబంధించి వేస‌వి సెల‌వుల నిర్ణ‌యం పై సీఎం కేసీఆర్ , ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ,విద్యాశాఖ అధికారుల‌తో నేడు ఉద‌యం స‌మీక్షించార‌ని మంత్రి తెలిపారు. కొవిడ్ సెకండ్‌వేవ్ వేగంగా విస్త‌రిస్తున్న సంద‌ర్భ‌రంలో ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే 10 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి 5,21,392 మంది విద్యార్థుల‌ను పాస్ చేసిన‌ట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుండి 9వ త‌ర‌గ‌తివ‌ర‌కు చ‌దువుతున్న 53 ల‌క్ష‌ల 79వేల‌388 మంది విద్యార్థుల‌ను పైత‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. పాఠ‌శాల‌లు ,జూనియ‌ర్ క‌ళావాల‌ల‌ను త‌రువాత ఎప్పుడు తెరిచేది కొవిడ్-19 ప‌రిస్థితిని అనుస‌రించి జూన్ 1 న ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంద‌ని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ఇప్పుడు విద్యా సంవ‌త్స‌రం చివ‌రి దినంగా ప‌రిగ‌ణిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *