సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగంపై స‌మీక్ష‌…..

తెలంగాణ రాష్ట్రంలో సాగు ప‌రిస్థితులు, ధాన్యం కొనుగోళ్ల‌పై ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ రంగంపై 2021,జ‌న‌వ‌రి 24న తేదీ ఆదివారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటైన త‌రువాత వ్య‌వ‌సాయ రంగంలో అనేక మార్పులకు తెలంగాణ స‌ర్కార‌కు శ్రీ‌కారం చుట్టింది. రైతు బంధు, రైతు వేదిక‌లు, రైతు స‌మ‌న్వ‌య స‌మితిల‌ను ఏర్పాటు చేసింది. వీటికి తోడుగా గ‌తేడాది నియంత్రిత‌సాగు విధానం అమ‌లు చేశారు. అయితే ఫ‌లితాలు సానుకూలంగా రాక‌పోవ‌డంతో నియంత్రిత సాగును విష‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కిత‌గ్గింది.అయితే రైతులు పండించిన పంట‌కు మంచి గిట్టుబాట ధ‌ర రావాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, చ‌ర్య‌ల‌పై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. నియంత్రిత సాగు లేక‌పోయినా.. ప్ర‌భుత్వ ప‌రంగా కొనుగోలు కేంద్రాలు లేకపోయినా రైతుల‌కు న‌ష్టం రాకుండా ఉండాలంటే అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై ఆదివారం స‌మీక్ష‌లో చ‌ర్చించ‌నున్నారు. సీఎం కేసీఆర్‌. అందుబాటులో ఉంచ‌డం.. నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా వంటి అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *