నిరుద్యోగుల‌కు తీపిక‌బురు…

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల హామీల అమ‌ల్లో భాగంగా ఇంత‌క‌ముందే జీహెచ్ఎంసీపై దృష్టి పెట్టిన కేసీఆర్ ప్ర‌భుత్వం, తాజాగా నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి సంగ‌తి వినిపించ‌బోతోంది. ఇప్ప‌టికే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ల‌క్షా 31 వేల ఉద్యోగాల‌ను టీఆర్ఎస్ స‌ర్కార్ భ‌ర్తీ చేసింది.2018ముందస్తు ఎన్నిక‌ల్లో నిరుద్యోగుల మ‌ద్ద‌తును పొందెందుకు ఓ కీల‌క‌మ‌యిన హామి ఇచ్చిన విష‌యం తెలిసిందే. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగుల‌కు 3016/- రూపాయ‌ల నిరుద్యోగ భృతిని
అందిస్తామ‌ని ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ హామి ఇచ్చారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా అంశాన్ని పొందుప‌రిచారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి రెండేళ్లు గ‌డిచిన ఇంకా ఆ ఎన్నిక హామీని నెర‌వేర్చ‌లేదంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు వెలువెత్తాయి. అదే సంద‌ర్భంలో నిరుద్యోగులు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఈ విష‌య‌మై మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌టి రెండ్రోజుల్లోనే సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నిరుద్యోగ భృతి గురించి తీపి క‌బురు చెప్ప‌బోతున్నారు. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం 1.31 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసింది. మ‌రో 50 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు అన్ని ఏర్పాట్ల‌ను చేస్తున్నాం. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంది. అని మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు గురువారం జ‌రిగిన ఓ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతికి
అర్హులు ఎవ‌రు? ఏఏ అంశాల ప్రాతిప‌దిక‌న నిరుద్యోగ భృతిని ఇస్తారు? కుటుంబంలో ఎంత‌మంది నిరుద్యోగులు ఉన్నా, అంద‌రికీ ఇస్తారా? ల‌ఏక ఒక్క‌రికేనా? డిగ్రీని అర్హ‌త‌గా చేస్తారా? పాలిటెక్నిక్‌, ఐటీఐ వంటి సాంకేతిక కోర్సుల‌ను చేసిన వారిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం నిరుద్యోగులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు త్వ‌ర‌లోనే తెలంగాణ సీఎంగా ప్ర‌మోష‌న్ పొందుతారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మంత్రులు కూడా అయితే త‌ప్పేంట‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే కీల‌క ప‌నులు జ‌రుగ‌తున్నాయ‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి , విశ్రాంతి తీసుకుంటార‌నీ, ఆ త‌రువాత కేటీఆర్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాల్లోనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈవార్త‌ల‌కు సంబంధించి కూడా క్లారిటీ వ‌స్తుంద‌ని అంతా అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *