నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌….

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రలో ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లోనే నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించ‌వ‌చ్చు అని మంత్రి కేటీఆర్ అన్నారు.తెలంగాణ భ‌వ‌న్‌లో రాష్ట్ర విద్యుత్‌కార్మిక సంఘం స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్‌, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పారు. సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌న్నారు. ఇప్ప‌టికే ల‌క్ష‌31 వేల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లుగా తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌రో 50 వేల ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *