మ‌హాపురుషునిగా చేసే స‌ద్గుణాల‌ను సూచించిన మార్గ‌ద‌ర్శ‌కుడు…

హైద‌రాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం తీసురావ‌టానికి ఎంతో శ్ర‌మించిన మ‌హా మ‌నిషి గాంధీగారు. భాత‌ర ఉప‌ఖండంలో స్వాతంత్య్ర స‌ముపార్జ‌న‌కై జ‌రిగిన అనే క ఉద్య‌మాల‌న‌న్నిటినీ క‌లిపి భార‌త్ కాంగ్రెస్ క‌ల‌క‌త్తా స‌మావేశంలో 1929 డిసెంబ‌ర్ లోగా బ్రిటీష్ ప్ర‌భుత్వం భార‌త దేశానికి… దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్ట‌ట‌మే కాకుండా, మ‌నిషిని మ‌హాపురుషునిగా చేసే స‌ద్గుణాల‌ను సూచించిన మార్గ‌ద‌ర్శ‌కుడు గాంధీజీ. జాతిపిత మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్మ‌రించుకున్నారు. ప్రార్థ‌న ,అభ్య‌ర్థ‌న‌,నిర‌స‌న అనే ఆయుధాల‌తో ప్ర‌పంచానికి స‌రికొత్త పోరాట మార్గాన్ని చూపిన మ‌హా మ‌నిషి గాంధీగారు. దేశా ప్ర‌జ‌ల కోసం నిత్యం శ్ర‌మించిన ఆద‌ర్శ‌ప్రాయుడ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్బంగా ఆయ‌నకు సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. మ‌హాత్మాగాంధీ అహింస‌, స‌త్యాగ్ర‌హ దీక్ష‌ల ద్వారా స్వాతం‌త్య్ర సంగ్రామాన్ని ఉర‌క‌లెత్తించార‌ని కీర్తించారు. దేశంలో కోసం త‌న జీవితాన్ని అర్పించార‌ని పేర్కొన్నారు. మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతిని అమ‌ర‌వీరుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ఎప్పటికైనా స‌త్యానిదే అంతిమ విజ‌య‌మ‌ని గాంధీ జీవితం చాటి చెప్తుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *