రైతులు లేనిదే దేశం సుఖ‌సంప‌ద‌ల‌తో వ‌ర్ధ‌ల్ల‌దు…

న్యూఢిల్లీ: ఇటీవ‌ల కాలంలో రైతుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చిన్న చూపుచూసింద‌ని రైతు సంఘ‌ల ఆందోళ‌న తెలిసిన విష‌య‌మే. రైతుల చుడ‌కుండా పోలీస్ బ‌ల‌గాల‌తో కాల్పులు,విచ్చ‌ర‌హిత్యంగా ప్ర‌వ‌ర్తిచింద‌ని రైతులు ఆందోళ‌న చేశారు. వ్య‌వ‌సాయ సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న బాట ప‌ట్టిన రైతు సంఘాల నాయ‌కులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం విధాన స‌భ‌లో స‌మావేశ‌మవుతార‌ని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్‌) వెల్ల‌డించింది. రైతుల‌తో భేటీ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఇత‌ర సంబంధిత అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని, రైతుల‌కు త‌మ పార్టీ బాస‌ట‌గా నిలుస్తుంద‌ని ఆప్ త‌న అధికారిక ట్విట‌ర్ ఖాతాలో పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వసాయ చ‌ట్టాల‌ను కేజ్రీవాల్ మొద‌టినుంచి వ్య‌తిరేకిస్తున్నారు. రైతుల శాంతియుత ఆందోళ‌న‌ల‌కు త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఈమ‌ధ్య కాలంలో చెపారు. రైతులు ఆనందంగా లేని దేశం ఎన్న‌డూ సుఖ‌సంప‌ద‌ల‌తో వ‌ర్ధ‌ల్ల‌ద‌ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశ రాజ‌ధానిలో రిప‌బ్లిక్ డేనాడు జ‌రిగిన కిసాన్ ట్రాక్ట‌ర్ ప‌రేడ్ హింసాత్మ‌కంగా మార‌డం ప‌ట్ల అప్ప‌ట్లో ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *