ట్విట్ట‌ర్‌లో మోదీని64.7 మిలియ‌న్ మంది ఫాలోయింగ్‌….

న్యూఢిల్లీ: ట‌్విట్ట‌ర్ లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీయే టాప్ అని తేలింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధానిమోదీని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధాని మోదీ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తాజా ప‌రిణామాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా మాధ్య‌మంగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడుతానికి ట్విట్ట‌ర్‌లో మోదీని 64.7 మిలియ‌న్ మంది ఫాలో అవుతున్నారు. అయితే మొన్న‌టి వ‌ర‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంపే . అత‌డిని88.7 మిలియ‌న్ మంది ఫాలో అవుతున్నారు. కానీ వాషింగ్ట‌న్‌లో త‌లెత్తిన ప‌రిణామాలపై ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్‌మీడియా మాధ్య‌మంగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. అమెరికా అధ్య‌క్షుడు నూత‌నంగా ఎన్నికైన జోబైడెన్‌ను 23.3 మిలియ‌న్ మంది ఫాలో అవుతున్నారు. ఇక మ‌న భార‌త్ విష‌యానికి వ‌స్తే కేంద్ర హోంమంత్రి షాను24.2 మిలియ‌న్ మంది ఫాలో అవుతుండ‌గా ,ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను 21.2 మిలియ‌న్ మంది ఫాలో అవుతున్నారు. అయితే రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా లేని నేత‌ల్లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామాయే టాప్‌లో ఉన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒబామాను 127.9 మిలియ‌న్ మందిఫాలో అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *