జ‌డేజా రాక‌తో చెన్నై శిబిరంలో జోష్ ..

ముంబై: భార‌త్‌స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా క్వారంటైన్ పూర్తి చేసుకుని గురువారం చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) క్యాంపులోచేరాడు. ఎల్లో జెర్సీలో స‌హ‌చ‌ర ఆట‌గాడు సురేష్ రైనాతో క‌లిసి దిగిన ఫొటోను మూడు సార్లు ఐపీఎల్ చాంపియ‌న్ చెన్నై ట్విట‌ర్లో షేర్ చేసింది. మైదానం బ‌య‌ట‌, లోప‌ల చాలా ఉత్సాహంగా ఉండే జ‌డేజా రాక‌తో చెన్నై శిబిరంలో జోష్ వ‌చ్చింది. గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించిన జ‌డ్డూ సీఎస్కే క్యాంపులో చేర‌డానికి ముందే ట్తైనింగ్ ప్రారంభించాడు. ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్ ఏప్రిల్‌9నుంచి ఆరంభంకానుండ‌గా మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై త‌న తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది. గ‌త జ‌న‌ప‌రిలో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో జ‌డేజా బొట‌న‌వేలుకు గాయ‌మైంది. దీంతో జ‌డ్డూ ఇటీవ‌ల ఇంగ్లాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌కు దూర‌మ‌య్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *