చెన్నైసూప‌ర్‌కింగ్స్ సార‌థికి 12ల‌క్ష‌ల జ‌రిమానా..

ముంబై: ఐపీఎల్ 14 సీజ‌న్ కు చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ మ‌హీంద‌ర్‌సింగ్‌ధోనీకి ఏకంగా రూ.12 ల‌క్ష‌ల జారిమానా విధించారు. ఢిల్లీ క్యాపిట‌ల్స‌తో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కారణంగా ధోనీకి ఈ జ‌రిమానా విధించ‌డం విశేషం. దీనిని తొలి నేరంగా ప‌రిగ‌ణించి జ‌రిమానాతో వ‌దిలేశారు. ఈమ్యాచ్‌లో ధోనీ డ‌కౌటైన సంగ‌తి తెలిసిందే.2015 త‌రువాత చెన్నై జ‌ట్టు త‌ర‌పున ధోనీ డ‌కౌవ‌డం ఇదే తొలిసారి. ఈమ్యాచ్‌లో చెన్నైకి సానుకూల అంశం ఏదైనా ఉందంటే ఇది సురేష్ రైనా ఫామ్‌లో కి రావ‌డమే . గ‌త సంవ‌త్స‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఐపీఎల్ కి దూరమైన రైనా…. ఈ సారి వ‌చ్చీ రాగానే దంచికొట్టాడు. త‌న ఫామ్‌, ఫిట్ నేష్‌పై ఉన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *