కొవాగ్జిన్ టీకా మాకు వ‌ద్దు _ఛ‌త్తీగ‌ఢ్‌

న్యూఢిల్లీ: ఇప్పుడు క‌రోనా మ‌మ్మాహ‌రిని ఎదుర్కోవ‌డానికి ఇండియాలో రెండు వ్యాక్సిన్ల‌ను వినియోగిస్తున్నారు. అందులో ఒక‌టి సీరం కు చెందిన కొవిషీల్డ్ కాగా.. మ‌రొక‌టి హైద‌రాబాద్‌లోని భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌. అయితే ఈ కొవాగ్జిన్ ఇంకా మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉండ‌గానే దానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇచ్చింది. దీనిపై అభ్యంత‌రాలు తెలిపిన కొంత మంది ఈ వ్యాక్సిన్‌ను నిరాక‌రిస్తున్నారు. తాజా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛ‌త్తీస్‌గ‌ఢ్ కూడా కొవాగ్జిన్ త‌మ‌కు వ‌ద్ద‌ని కేంద్రానికి లేఖ రాసింది.కొవాగ్జిన్ వ్యాక్సిన్ త‌మ‌కు ఎందుకు వ‌ద్దో వివ‌రిస్తూ ఛ‌త్తీగ‌ఢ్ ఆరోగ్య‌శాఖ మంత్రి టీఎష్ సింగ్ దేవ్ కేంద్రానికి లేఖ రాశారు. మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ఇంకా పూర్తి కాకపోవ‌డం ఒక కార‌ణ‌మైతే…. వ్యాక్సిన్ సీసాల‌పై ఎక్స్‌పైరీ డేట్ లేక‌పోవ‌డం మ‌రో కార‌ణంగా ఆయ‌న చూపారు. ఈరెండు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కూ కొవాగ్జిన్‌ను పంప‌వ‌ద్ద‌ని ఆయ‌న కేంద్రాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *