శ్రీ‌లంక క్రికెట్ బోర్డు – వాస్ పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది…

కొలంబో: శ్రీ‌లంక మోస్ట్ స‌క్సెస్‌పుల్ మాజీ పేస్ బౌల‌ర్ చ‌మిందా వాస్ కు శ్రీ‌లంక బౌలింగ్ కోచ్‌గా నియ‌మితుడైయ్యాడు.ఈ మ‌ధ్య సౌతాఫ్రికా,ఇంగ్లండ్ టూర్‌ల‌లో టీమ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రీ దారుణంగా ఉంటంతో అప్ప‌టి వ‌ర‌కూ బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేవిడ్ స‌క‌ర్‌ను తొల‌గించి గ‌త వార‌మే ఈ బాధ్య‌త‌లు వాస్‌కు అప్ప‌గించింది లంక బోర్డు. శ్రీ‌లంక క్రికెట్ బోర్డుతో డ‌బ్బు విష‌యంలో డీల్ కుదర‌క‌పోవ‌డంతో అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. స‌రిగ్గా శ్రీ‌లంక టీమ్ వెస్టిండీస్ టూర్‌కు బ‌య‌లుదేరే స‌మ‌యంలో వాస్ రాజీనామా చేయ‌డంపై లంక బోర్డు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది.సోమ‌వారం రాత్రి టీమ్ తో క‌లిసి వాస్ వెస్టిండీస్‌కు వెళ్లాల్సింది .టెస్టుల్లో 355,వ‌న్డేల్లో 400 వికెట్లు తీశాడు. అలాంటి లెజెండ‌రీ బౌల‌ర్ ఇలా ఉన్న‌ట్లుండి రాజీనామా చేయ‌డంపై లంక బోర్డు ఆవేద‌న వ్య‌క్తం చేసింది.శ్రీ‌లంక టీమ్ వెస్టిండీస్ టూర్‌కు బ‌య‌లుదేరే ముందే వాస్ రాజీనామా చేయ‌డంపై లంక బోర్డు తీవ్ర అంస‌తృప్తి వ్య‌క్తం చేసింది. ఇప్పుడు ప్రపంచ‌వ్యాప్తంగా అంద‌రికి ఆర్థిక ప‌రిస్థితులు త‌ల‌కిందులైన స‌మ‌యంలో వాస్ ఇలా చేయ‌డం స‌రికాద‌ని, అది కూడా టీమ్ బ‌య‌లుదేరే ముందే రాజీనామా చేయ‌డం ఏంట‌ని లంక బోర్డు అధికారి ప్ర‌శ్నించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *