కేంద్ర స‌ర్కార్ రైతుల‌కు లేఖ రాసింది….

ఢిల్లీఃఈనెల 30న చ‌ర్చ‌ల‌కు రావాల‌ని రైతు సంఘాల‌కు కేంద్రం లేఖ రాసింది. మంళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు చర్చ‌ల‌కు వ‌స్తామ‌ని కేంద్రానికి శ‌నివారం రైతులు లేఖ రాశారు. అయితే బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భవ‌న్ లో స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని కోరింది. ఈ మేర‌కు 40రైతు సంఘాల‌కు కేంద్రం లేఖ‌లు పంపింది. సాగు చ‌ట్టాల‌పై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌కు తెర‌దించేలా విశాల దృక్ప‌థంతో సానుకూల చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధ‌మ‌ని రైతులకు పంపిన కేంద్రం లేఖ‌లో పేర్కొంది. కానీ శ‌నివారమే రైతులు త‌మ లేఖ‌లో 4 అంశాల‌ను అజెండాను ప్ర‌తిపాదించారు. అయితే చ‌ర్చ‌లు బుధ‌వారం జ‌ర‌పుదామ‌ని కేంద్రం తాజాగా రైతుల‌కు లేఖ రాసింది. దీనిపై రైతు సంఘాలు స్పందించాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *