జ‌న‌వ‌రి 16న భారత‌దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌…

న్యూఢిల్లీ: క‌రోనా టీకాను ఏప్రిల్ నెల‌లో ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొన‌సాగించాల‌ని రాష్ట్రాల‌న‌ను కోరింది కేంద్ర ప్ర‌భుత్వం . ఇందులో భాగంగా 45 సంవ‌త్స‌రాలు దాటిన అంద‌రికీ వ్యాక్సిన్లు ఇవ్వ‌నున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగం పెంచ‌డంలో భాగంగా రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల‌తో సంప్ర‌దించిన త‌రువాత కేంద్రం ఈనిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌వ‌రి 16న భార‌తదేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఫిబ్ర‌వ‌రి నుంచి కొవిడ్ కేసులు మ‌ళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధ‌వారం ఏకంగా 72 వేల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. ఈ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేంద్రం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతంపై చేయ‌డంపై దృష్టి సారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *