వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లు పై సుప్రీంకోర్టు స్టే …

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కేంద్రం తీసుకొచ్చిన మూడు తాజా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఏర్పాటు చేసిన ముగ్గురు స‌భ్యుల క‌మిటీ బుధ‌వారం సీల్డ్ క‌వ‌ర్‌లోనివేదిక స‌మ‌ర్పించింది. మొత్తం 85 రైతు సంఘాల‌తో తాము సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు ఈ నేప‌థ్యంలో క‌మిటీ వెల్ల‌డించింది. వాళ్లంద‌రితో మాట్లాడిన త‌రువాత ఈ స‌మ‌స్య‌కు ప‌రష్కారం కోసం ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పింది. అయితే రిపోర్ట్ లో ఏముందో మాత్రం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీంకోట‌ర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. గ‌త జ‌న‌వ‌రి12న వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగ‌తి తెలిసిందే. రెండు నెల‌ల పాటు అమ‌లు ను నిలివేసి క‌మిటీని నియ‌మించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం…ఆలోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.కేంద్ర చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నాలుగు నెల‌లుగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళ‌న నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వంతో ఎన్నో రౌండ్ల చ‌ర్చ‌లు జ‌రిగినా అని కొలిక్కి రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *